నిండు నూరేళ్ళు వెలగాల్సిన ఆ దీపాలు
అర్ధాంతరంగా ఆరిపోయాయి
ఆశల ఇటుకలతో కట్టుకున్న
కలల సౌధాలు కుప్పకూలిపోయాయి
రుధిరచీర కట్టుకొని
వికట్టాట్టహాసం చేస్తున్న
మ్రుత్యుదేవతల ఆ ప్రాంతం
మళ్ళీ నగరంలో బాంబుల దాడి
ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ చానల్స్
శవాలను లెక్కపెట్టుకుంటూ
హడావిడిగా ఖాకీలు
'ఇది దొంగదెబ్బరా
నేరుగారండి మా తడాకా చూపిస్తాం'
నిరసనలు వ్యక్తం చేస్తూ కొన్ని గళాలు
కొన్ని రోజులుపోయాక
అంతా సద్దుమణిగాక
నిశ్శబ్దాన్ని బ్రద్దలుచేస్తూ
మళ్ళీ ఎక్కడో....
బాంబుల దాడి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి