29, సెప్టెంబర్ 2012, శనివారం

మార్చ్

అక్కడ తెలంగాణ మార్చ్
ఇక్కడ  సమైకాంద్ర మార్చ్
ఎప్పుడు వెలుగుతుందో పరిష్కారపు టార్చ్
నాయకులు ఏదో చెపుతుంటారు  జనాలను  ఏ మార్చి ...

26, సెప్టెంబర్ 2012, బుధవారం

అందాల జాతర




అందాల జాతర 

అక్కడ ఎగసి   పడుతున్న  వన్నె జలపాతాలు
పరువులు  తీస్తున్న  వయ్యారాల  సెలయేర్లు
రాసులు రాసులుగా క్రుమ్మరిస్తున్న  కొలతలతో ఇమిడిన అందాలు
కొన్ని మెరుపు తీగలు
కొన్ని హరివిల్లులు
కొన్ని తారకలు
నేలపైకి దిగి వచ్చి క్యాట్ వాక్ చేస్తున్నట్లు
మన్మధుడి ఊహకే అందని
కోటి పున్నముల  సౌందర్య రసాన్ని
కళ్ళ దొన్నుల లోకి ఒంపుతూ ..
ప్రపంచీకరణ పక్షి
విలువలను వలువలను తన్నుకు పోగా
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు పాతర వేస్తూ
అక్కడ ..అందాల జాతర 

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

గుండెలోతుల్లో





గుండెలోతుల్లో 

ఏకాంతం  గూటిలో నుండి బయటకి దూకి 
మనసుకి  ఊహలు రెక్కలు అతికించుకుని 
స్వప్న లోకాలకి ఎగిరి వెళ్ళాలని ఆశ 

నా గుండెలోతుల్లోనుంచి ప్రవహించే అక్షరాలూ 
అధరామృతం లా తియ్యగా ఉంటాయి 

నా అణువణువునా అంకురించే అక్షరాలలో 
వలపు విరజాజులే కాదు ...
విరహ విస్పొటనాలు ఉంటాయి.

 మధుర భావాల మరుమల్లెలే  కాదు  
 మాటలకందని  ఉంటాయి.     

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

రంగుల ప్రపంచం



అవమానాల కొరడా దెబ్బలు తింటూ
చీకటి శిలువ మోస్తూ
భారంగా అడుగులు వేస్తున్న
ఏసు క్రీస్తులం
చీకటి పాల సముద్రంలో
కస్టా ల శేష పాన్పు పై
పవళించిన విష్ణు మూర్తులం
సమస్యల స్మశా నంలో
చీకటి గరళాన్ని మింగిన
పరమ శివులం
వాళ్ళంతా కళ్ళు మోలిపించుకొని
చీకటి కత్తుల వంతెన పై
ప్రయా ణీస్తూ వుంటాం
పెదవుల నవ్వుల వెనుక
మనసు మూలుగులు విన ప డ నివ్వం
మా ఆత్మ విశ్వాసం ముందు
ఎవరెస్ట్ శిఖరం ఎంత ??
చీకటి మేఘాలు మా కంటి పాపలలో
ముసురు కొంటాయి
ఐ నా మా హృదయాలు మాత్రం
వెలుగు రేఖలు విరజిమ్ము తుంటాయి
ప్రపంచం మాకు ఒక చీకటి తెర
ఆత్మీయ స్పర్స పవనాలు మమ్ము తాకి నప్పుడు ఒక్క సారిగా
తెర జారి పోతోంది
రంగుల  ప్రపంచం మా ముందు
కనిపిస్తుంది .