26, సెప్టెంబర్ 2012, బుధవారం

అందాల జాతర




అందాల జాతర 

అక్కడ ఎగసి   పడుతున్న  వన్నె జలపాతాలు
పరువులు  తీస్తున్న  వయ్యారాల  సెలయేర్లు
రాసులు రాసులుగా క్రుమ్మరిస్తున్న  కొలతలతో ఇమిడిన అందాలు
కొన్ని మెరుపు తీగలు
కొన్ని హరివిల్లులు
కొన్ని తారకలు
నేలపైకి దిగి వచ్చి క్యాట్ వాక్ చేస్తున్నట్లు
మన్మధుడి ఊహకే అందని
కోటి పున్నముల  సౌందర్య రసాన్ని
కళ్ళ దొన్నుల లోకి ఒంపుతూ ..
ప్రపంచీకరణ పక్షి
విలువలను వలువలను తన్నుకు పోగా
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు పాతర వేస్తూ
అక్కడ ..అందాల జాతర 

5 కామెంట్‌లు:

  1. చాలా బాగా వ్రాసారండి అభినందనలు

    రిప్లయితొలగించండి
  2. అభినందనలు .. కవిత్వం తో పాటు మీ ఆలోచనలు కూడా అక్షరికరించండి

    రిప్లయితొలగించండి
  3. బుడ్డా మురళి గారు
    @skv రమేష్ గారు.
    ప్రోత్సహిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. చక్కటి పోస్ట్. బాగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  5. Anuradha gaaru.. Thank you very much. mee blog gurinchi vinnaanu.
    naa aalochanalu mecchinanduku dhanyavaadamulu.

    రిప్లయితొలగించండి