15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

అదరామృతం"క్షణాలు గంటల లోకి
 తర్జుమా అవుతున్న
 ఆ పువ్వు పై వాలిన
 ఈ తుమ్మెద కదలదు
 ఆ పెదవుల పై వాలిన
 ఈ పెదవులు విడివడవు
 అదరామృతం పానం చేస్తూ
 తన్మయ రాగాలు ఆలపిస్తూ
 ఆ రెండు దేహాలు
 ఆనందపు రెక్కలు తొడుక్కొని
 అద్బుత లోకాలలో విహరిస్తూ
 ఆ రెండు మనసులు
 బంధాలు తెంచుకుని
 మోక్ష తీరం చేరుతూ
 ఆ రెండు ఆత్మలు"

శిదిల శిల్పం"ఆమె పాల రాతి బొమ్మ
 వెన్నెల జలపాతం
 ఆమె పారిస్వంగ చెరసాల లొ
 చక్రవర్తులను బందించి
 పరువాల పునాదుల పై
 మహా సామ్రాజ్యం నిర్మించింది
 అందాలతొ విద్వంసం చేసి
 మహా నగరాలను సైతం
 నేల మట్టం చేసింది
 తన అదరాల పై అమృతాన్ని  చిందించిన ఆమె
 శృంగార  సాలి గుటిలొ మగధీరులను బందించిన ఆమె
 హాల హలాన్ని త్రాగి శిదిల శిల్పం గా
 శిలజంగ మారి చరిత్ర గర్బం లొకి జారి
 శాశ్వతంగా నిద్ర పొయింది
 ఆమె క్లియొ పాత్ర కావచ్చు
 ఇంకా ఇంకా ఎవరైనా  కావచ్చు
 చరిత్ర అగాధం లొ అంతుపట్టని రహస్యాలు ఎన్నొ"

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

అక్షరాభిషేకం

అక్షరాభిషేకం 

" ఆమె నడిచే నవల 
ఎగసి పడే చైతన్యపు అల 
ఆమె కదిలే కథ 
మదుర భావ సుధ
ఆమె పెదాల పై చెరగని నవ్వు 
స్నేహ పరిమళాలను రువ్వు 
ఆమె ఆలకించే అక్షరం 
ఆమె మానవత ప్రవాహం 
ఆమె నమ్మదు దైవం,కులం,మతం 
ఆమె కోరును సర్వ జన హితం 
ఆమె సింహపురి సాహితి సిరి 
ఆమె చేస్తారు ఒక వైపు వైద్యం 
మరొక వైపు సాహితి సేద్యం 
రెండు రంగాలలో ఆమె జయ ప్రదం "

(గురు తుల్యులు డా|| పెళ్లకూరు జయప్రద గారి పై అక్షరాభిషేకం )

రెక్కలు

రెక్కలు
1. "వాళ్ళకు కళ్ళు
కనపడవు
అయినా ఎప్పుడూ
పడిపోరు

ఒళ్ళంతా కళ్ళే."

2."ధరల చెట్టు
దిగి రానంటున్నాయి
నిత్య అవసర
సరుకులు

విక్రమార్కుడి ల
సామాన్యుడు."

3."చల్లని గాలి
సోకగానే
మబ్బు కరిగి
వర్షించింది

ఆత్మీయ కరచాలనం."

4."శోకం లోంచి
శ్లోకం
గాయం లోంచి
గేయం

వేదన లోంచే
ఆవిష్కారాలు."

5."మౌన మనే
విమానము నెక్కి
నిలోనికి
ప్రయాణించు

అంతర్యానమే
ధ్యానం."

రచన: మోపూరు పెంచల నరసింహం
నెల్లూరు
సెల్:9346393501