స్నేహ సంతకం |
ఈ జీవన యానంలో నేను ఒంటరిని కాను
నీ వెంట పెద్ద సమూహమే కడలి వస్తుంది
నేను కాలు మోపితే ఎడారి సైతం
నందన వనమవుతుంది
నా కరచాలనం సోకితే
కఠిన పాషాణం సైతం కరిగిపోతుంది
నేనెప్పుడు నా పెదవుల కొమ్మపై
చిరునవ్వుల పూవులు పూయిస్తూ ఉంటాను
సాహిత్య ఆకాశంలో
కవితల పిట్టలని ఎగురవేస్తుంటాను
ఆత్మ విశ్వాసం నా గుండె చప్పుడు
విజయం నా చిరునామా..
ప్రవహించే ప్రేమ నదిని నేను
స్నేహానికి నిలువెత్తు సంతకం నేను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి