తెలుగోడి ఘోష
అక్షరాలు కళ్ళు తెరిస్తే
అక్షరాలు ఒళ్ళు విదిలిస్తే
అక్షరాలు కి రెక్కలు మొలిస్తే
అక్షరాలు జెండాలై ఎగిరితే
అదే అదే అచ్చమైన స్వచ్చమైన
వాడి అయిన వేడి అయిన తెలుగు బాష
వెలుగులు విరజిమ్మే బాష
నన్నయ్య కలమై నర్తించిన బాష
తిక్కయ్య గళంలో పంచిన బాష
ఎఱ్రన్న పలుకులలో ఎదిగిన బాష
శ్రీనాధుని పలుకులలో సింగారొలికిన బాష
కమనీయంగా కవయిత్రి మొల్ల పలికిన బాష
పోతయ్య పలుకులలో భక్తి తరంగం లోలికిన బాష
వేమయ్య పలుకులలో విరక్తి పంచిన బాష
ముద్ద మందారాల బాష ముద్దులొలికె బాష
వెన్నెల జలపాతాల బాష వన్నె చిన్నెల బాష
పదము పదమున అమృతం చిందేటి బాష
ఆపాత మధురమైన బాష
అంతం కాబోతుందా నేడు?
కొన ఊపిరిలో ఉన్న తెలుగు తల్లికి ఊపిరిలూడుతూ
కొడిగడుతున్న తెలుగు దివ్వెను వెలిగిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి